Saturday, April 20, 2024

సికింద్రాబాద్ షాపింగ్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire accident in Footwear shop in Bansilalpet

హైదరాబాద్: సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేట్‌ జబ్బార్ కాంప్లెక్స్‌లోని చెప్పుల దుకాణంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీగా పొగ కమ్మేయడంతో అందరూ బయటకు పరుగులు పెట్టారు. షార్ట్ సర్క్యూట్ తోనే మంటల చెలరేగాయని అధికారులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న రెండు అగ్నిమాపక యాంత్రాలు మంటలను అదుపుచేశాయి. ఈ అగ్నిప్రమాదలో దెబ్బతిన్న ఆస్తి ఖర్చు ఇంకా అంచనా వేయలేదని అధికారులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News