Home రాష్ట్ర వార్తలు మల్లాపూర్ కెమికల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

మల్లాపూర్ కెమికల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

fire-accidentకాప్రా/ చర్లపల్లి:  హైదరాబాద్ మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని షలీస్‌లైట్ కెమికల్ పరిశ్రమ లో భారీ అగ్ని ప్రమాదం సంభవిం చింది. పరిశ్రమలో ఎలాంటి  రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ పరిశ్రమలో కార్మికులు అప్రమత్తంగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జర గలేదు. శుక్రవారం మిషన్లు ప్రారంభి స్తున్న సమయంలో కెమికల్ రియాక్షన్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లు కార్మికులు చెబు తున్నారు. వెంటనే సైరన్ మోగించడంతో కార్మికు లంతా బయటకు వచ్చారు. పరిశ్రమలో నిల్వ ఉం చిన డ్రమ్ములోని కెమికల్‌కు మంటలు అంటుకోవ డంతో దట్టమైన పొగలతో పాటు పెద్ద ఎత్తున మం టలు చెలరేగాయి. ఘటనాస్థ్ధలానికి 8 ఫైరింజన్లు చేరుకున్నా మంటలను అదుపు చేయలేకపోయా యి. పరిశ్రమలో నిల్వ డ్రమ్ములు, డబ్బాలు పేలుతుండటంతో కార్మికులు, చు ట్టూ ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మల్లాపూర్ పారి శ్రామికవాడ జనావా సాలకు దగ్గరగా ఉండటంతో చుట్టుప్రక్కల కాలనీ లోని ప్రజలు ఇళ్ల నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఘటన స్థ్ధలానికి నగర మేయర్ బొంతు రాంమ్మో హన్, ఎమ్మెల్యే ఎన్‌వి ఎస్‌ఎస్ ప్రభాకర్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనా ర్ధన్‌రెడ్డి, మల్కాజిగిరి డిసిపి రాంచందర్‌రెడ్డి, ఎసిపి రవిచంద్రన్‌రెడ్డి, మల్లా పూర్ ఐలా కమిషనర్ కళావతి, మల్లాపూర్, మీన్‌పేట్ హెచ్‌బి కాలనీ డివిజన్ల కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌రెడ్డి, గోల్లూ రి అంజయ్య, ఫైర్ అధికారులతో పాటు వివిధ విభాగాల అధికారులు చేరు కుని మంటలను సాయంత్రానికి అదుపులోకి తీసుకు వచ్చారు. అధికారుల అంచనాల ప్రకారం 10 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది.
కెమికల్ పరిశ్రమలను దూర ప్రాంతాలకు తరలిస్తాం : మేయర్
గత 40 సంవత్సరాల క్రితం ఇక్కడ జనావాసాలు లేని సమయంలో ఈ ప్రాంతంలో పారిశ్రామికవాడల ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం అనుమ తు లు ఇచ్చా రని నగరం పెరిగి పరిశ్రమల చుట్టూ ఇళ్లు నిర్మాణం జరగడంతో ఇక్కడి పరిశ్ర మలను ముఖ్యంగా కెమికల్ పరిశ్రమలను దూర ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని త్వరలోనే ఈ పరిశ్ర మలను తరలిస్తా మని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఉప్పల్ ఎమ్మె ల్యే ప్రభాకర్, జిహె చ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, వివిధ విభాగాల అధికా రులతో కలసి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి పరిస్ధితిని చక్కదిద్దారు. చుట్టూ ఉన్న ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు జిహెచ్ ఎంసి నుంచి 50 నీటి ట్యాంకర్లను, 10 ఫైర్ ఇంజన్లను తెప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం ఎలా జరిగింది, జరిగిన నష్టంపై వెం టనే నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిబంధ నలకు విరుద్ధంగా నడుస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని అధికారుల కు తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 25 పరిశ్రమలకు నోటీసులు
ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే స్పందించే అధికారులు ప్రమాదం జరగ క ముందు పరిశ్రమలను పర్యవేక్షించక పోవడం, రక్షణ చర్యలు తీసుకోవ డంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రమాదం జరిగిన ఒక్క రోజే నాచారం, మల్లాపూర్ పారిశ్రామికవాడలలోని 25 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చారం టే అధికారుల పనితీరు ఇట్టే తెలుస్తుంది. క్రమంగా పరిశ్రమలను తనీఖీ చే యాల్సిన పిసిబి, పరిశ్రమల విభాగం అధికారులు ఆ దిశగా చర్యలు తీసు కోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పలువురు స్థ్ధానికులు అంటున్నారు.