Wednesday, April 24, 2024

ప్రభాస్‌ అభిమానుల అత్యుత్సాహం… థియేటర్‌లో ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire accident in movie theater in Tadepalligudem

తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకటరామ థియేటర్‌లో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. పాన్ ఇండియా నటుడు ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ చిత్రం బిల్లా వెంకటరామ థియేటర్‌లో ప్రదర్శించబడింది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ సీట్ల మధ్యలో పటాకులు కాల్చారు. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కొన్ని కుర్చీలు కాలిపోయాయి. థియేటర్ లో పొగలు కమ్ముకున్నాయి. భయంతో, అభిమానులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి థియేటర్ వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News