Thursday, April 25, 2024

చిలకలగూడలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

fire accident in Secunderabad Chilkalguda

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని చిలకలగూడ పరిధి మహమ్మద్ గూడలో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్ మెంట్ లోని ఇంట్లో షార్ట్ సర్యూట్ తో మంటలు చెలరెగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు బయటకు పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

fire accident in Secunderabad Chilkalguda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News