- Advertisement -
తిరుపతి : తిరుమల తిరుపతిలోని శేషాచలం అడవుల్లో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కపిల తీర్థంపై భాగంలో ఉన్న కొండపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్నారు. మంటలు పరిసర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుండటంతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
- Advertisement -