Home రాష్ట్ర వార్తలు గగన జ్వాల

గగన జ్వాల

హైదరాబాద్ సీతారాంబాగ్ ప్లాస్టిక్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం
12 గంటలకు పైగా ఫైరింజన్ల జలయుద్ధం, ఇళ్లను ఖాళీచేయించిన పోలీసులు

fire-accidetnసిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో ఐదు అంతస్థుల భవనంలో ఉన్న ఓ ప్లాస్టిక్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 12 గంటల పాటు ఎకధాటిగా మంటలు ఎగిసిపడటంతో భవనం కుప్పకూలిపోయింది. అం తకుముందే భవనం చుట్టుపక్కల ఉన్న ఇళ్లను పోలీసులు ఖాళీ చేయించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించగా ప్రాణనష్టం జరగ లేదు. నగరంలో ఇంత పెద్ద అగ్ని ప్రమాదం గతంలో ఎన్నడు జరగలేదని అధికారులు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమర్‌అగర్వాల్ వ్యాపార నిమిత్తం మూడు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌కు వచ్చి బేగంబజా ర్‌లో ప్లాస్టిక్ వస్తువుల దుకాణం నడిపిస్తున్నాడు. ఇక్కడి నుంచే ఇతర జిల్లాలకు ప్లాస్టిక్ ఫర్నిచర్, ప్లాస్టిక్ బకెట్లు, బిందెలు, ఇతర అన్ని రకాల వస్తువులు సర ఫరా చేస్తున్నాడు. మంగళ్‌హాట్‌లోని సీతారాంబాగ్‌లో ఇటీవలే నిర్మించిన ఐద అంతస్థుల భవనంలో ప్లాస్టిగ్ గౌడాన్ నిర్వహిస్తునే మరోవైపు ‘ఇండియన్ పబ్లిక్ స్కూల్’కు అద్దెకు ఇచ్చాడు. ఇదిలావుండగా ఆదివారం ఉదయం 11 గంటలకు గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న షెటర్‌లోంచి పొగలు రావడాన్ని స్థాని కులు గమనించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు మంగళ్‌హాట్ పోలీసులకు సమాచారం అందించారు. ముందు గా ఘటనా స్థలానికి గౌలిగూడ అగ్నిమాపక కేంద్రం నుంచి ఒక్క ఫైరింజన్ మాత్రమే వచ్చింది. అయితే షెట్లర్‌కు తాళాలు వేసి ఉండడంతో సిబ్బంది షెట్టర్‌ను గడ్డపారలతో పగులగొట్టే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు వెనువెంటనే రెండు, మూడు, నాలుగు, ఐదో అంతస్థులో ఉన్న ప్లాస్టిక్ సమాగ్రికి ఎగబాకాయి. కేవలం గంటన్నర వ్యవధిలో మంటలు భవనం మొత్తానికి చుట్టేచేసుకున్నాయి. అయితే భవనంలోపలికి అగ్ని మాపక సిబ్బంది వెళ్లడానికి వీళ్లేకుండా పోయింది. దీంతో మంటలు ఆర్పడం సాధ్యంకాలేదు. లోపల అంతా ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతో మంటలు త్వరగా అదుపులోకి రాలేదు కదా ఇంకా తీవ్ర మయ్యాయి.దీంతో అధికారులు నగరంలోని అన్ని ఫైర్ స్టేషన్‌ల నుంచి ఫైరింజన్లను, సిబ్బందిని రప్పిం చారు. అయితే భవనంలోకి వెళ్లేందుకు సిబ్బందికి అనుకూ లంగా లేకపోవడంతో మంటలు ఎగిసిపడుతునే ఉన్నాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తునే ఉన్నా మంటలు అదుపు లోకి రాలేదు. ఆ భవనంలో కోట్లాది రూపాయల విలువైన ప్లాస్టి క్ సామాగ్రి ఫుల్‌గా ఉండడమే ఇందుకు కారణం. అందులో భవనం లోపలికి వెళ్లే పరిస్థితులు లేకపోవడం కూడా మంట లు అదుపులోకి రాకపోవడం మరో కారణం. అయితే మంటలు రావడానికి షాట్‌సర్కూటా? మరేదైనా కారణమా అనే కోణం లో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే కోట్ల రూపాయల ఆస్తి నష్టం కాగా, ప్రాణ నష్టం కలగ లేదు.
అనుకున్నదే అయినది…
మంటల దాటికి ఐదు అంతస్థుల భవనం పూర్తిగా కాలిపోయింది. సుమారు 12 గంటలకుపైగా మంటలు ఎగిసిపడడంతో మంటల దాటికి భవనం పిల్లర్లు పూర్తిగా వేడెక్కాయి. దీంతో భవనం ఒకవైపుకు ఒరిగిపోయింది. అక్కడ క్కడ భవనానికి పగుళ్లు కూడా కనిపించాయి. ఏ క్షణంలోనైనా భవనం కూలిపోయే ప్రమాదం ఉందని పసిగట్టిన అధికారులు దాని పక్కనే ఆనుకుని ఉన్న 30 ఇళ్లను హుటాహుటీనా ఖాళీ చేయించారు. వీరికి పునరావాసం కింద దగ్గరలోని దేవాల యంలో పాటు కమ్యూనిటి హాల్‌లో నివాసం కల్పించారు. సగం బస్తీని ఖాళీ చేయించిన పోలీసులు మంటలను అదుపు చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. రాత్రి 10.30 గంటలకు భవనం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది.
జిహెచ్‌ఎంసి అనుమతులు లేవు…
జిహెచ్‌ఎంసి నిబంధనలకు విరుద్దంగా భవనం నిర్మించారని తెలుస్తుంది. తద్వారానే అగ్ని ప్రమాదం చోటుచేసు కున్నా.. భవనంలోకి వెళ్లడానికి సరైనా మార్గాలు లేవు. దీని కారణం గానే మంటలు పై అంతస్థువరకు వ్యాపించాయి. జిహెచ్‌ఎంసి అనుమతులు లేకుండానే ఈ భవనం నిర్మించారని తెలుస్తుంది. ఇటీవలే ఈ భవన నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్లాస్టిక్ గౌడాన్, స్కూల్ నడిపిస్తున్నారు.
తప్పిన భారీ ప్రాణనష్టం…
ఆదివారం కావడంతో ఇదే భవనంలో ఒకవైపు కొనసాగుతున్న ఇండియన్ హై స్కూల్‌కు విద్యార్థులు ఎవరు రాలేదు. ఒకవేళ్ల స్కూల్ నడుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించి ఉండేదని అధికారులు అంటున్నారు. ఈ మంటలకు స్కూల్ భాగానికి కూడా పూర్తిగా వ్యాపించాయి.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు :జిహెచ్‌ఎంసి కమిషనర్
సీతారాంబాగ్ అగ్నిప్రమాద ఘటనను జిహెచ్‌ఎంసి కమిషనర్ బి.జనార్ధాన్‌రెడ్డి, నగర మేయర్ బి.రామ్మెహన్ సందర్శించి పరిశీలించారు. అగ్నిప్రమాద బాధితులకు ప్రత్యేక పునరా వాసం ఏర్పాటు చేశామని వారు తెలిపారు.ఈ భవనం అక్ర మంగా నిర్మించారని వారు నిర్ధారించారు. సీతారాంబాగ్‌తో పాటు ఏవైనా అగ్నిప్రమాద సంఘటనలు జరిగితే వెంటనే సంప్రదించేందుకు జిహెచ్‌ఎంసి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. జిహెచ్‌ఎంసి కంట్రోల్ రూమ్ నెంబర్ 9704601866కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం, తెలుసుకోవడం జరుగుతుం దన్నారు.