Tuesday, September 26, 2023

పెద్ద అంబర్‌పేట్ వద్ద ఓఆర్ఆర్ పై ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire Accident on ORR at Pedda Amberpet

హైదరాబాద్: నగరంలోని పెద్దఅంబర్ పేట్ వద్ద ఓఆర్ఆర్ పై శనివారం తెల్లవారుజామున ప్రమాదం సంభవించింది. ఓ కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న వాహన దారుడు మంటలను గమనించి డ్రైవర్ ను బయటకి తీశాడు. అప్పటికే డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. తక్షణమే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. మంటల ధాటికి కారు, లారీ దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. శంషాబాద్ నుండి ఘట్కేసర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News