Home జాతీయ వార్తలు ముంబయిలో అగ్నిప్రమాదం

ముంబయిలో అగ్నిప్రమాదం

fire accidentముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో వరస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే,  శనివారం తెల్లవారుజామున క‌మ‌లా మిల్స్ కాంపౌండ్ ప్రాంతానికి స‌మీపంలో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో అగ్ని ప్ర‌మాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో అయిదు ఫైర్ ఇంజిన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సిఉంది. గ‌త సంవత్సరం డిసెంబ‌ర్ లో క‌మ‌లా మిల్స్ కాంపౌండ్‌లో ఉన్న రెండు రెస్టారెంట్ల‌లో అగ్ని ప్ర‌మాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాద ఘ‌ట‌న‌లో అనేక మంది చనిపోయారు.

Fire At Building Under Construction In Mumbai