Home జాతీయ వార్తలు ముంబై నాలుగంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం

ముంబై నాలుగంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం

Mumbai building

ఒకరి మృతి, 14 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది

ముంబై : ఇక్కడి మెర్రీ వెదర్ రోడ్డు లోని నాలుగు అంతస్తుల నివాస భవనంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మిగతా14 మందిని అగ్నినివారణ సిబ్బంది రక్షించారు. తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్ వెనుక ఈ భవనంలో ప్రమాదం గురించి సమాచారం అందగా మధ్యాహ్నం 12.17 గంటలకు అగ్నినివారణ సిబ్బంది వచ్చారు. మంటల్లో చిక్కుకున్న వారిని సీనియర్ సిటిజన్లతో సహా మొత్తం 14 మందిని నిచ్చెన్ల సహాయంతో పైకి తీసుకురాగలిగారు. నాలుగు ఫైర్ ఇంజిన్లు, అనేక ట్యాంకర్లు మంటలను ఆర్పడానికి తోడ్పడ్డాయి. ప్రమాదానికి కారణమేమిటో ఇంకా తెలియరాలేదు.

Fire at Mumbai building kills one, injures another