Thursday, April 25, 2024

శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire at Srisailam hydroelectric plant in Telangana

హైదరాబాద్: శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్యానల్ బోర్డులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో విధుల్లో 30 మంది ఉండగా… జలవిద్యుత్ కేంద్రంలోనే 9మంది సిబ్బంది చిక్కుకున్నారు. సొరంగ మార్గం ద్వారా 15సిబ్బంది బయటపడ్డారు. గాయపడిన సిబ్బందిని జెన్ కో ఆస్పత్రిలో తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో డిఇ పవన్ కుమార్, ప్లాంట్ జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, డ్రైవర్ పాలంకయ్య, మాతృ, కృష్ణారెడ్డి, వెంకటయ్య ఉన్నారు. సహాయక బృందాలు కొందరిని బయటకు తీసుకువచ్చారు.

ప్రమాదంలో చిక్కుకున్న 9 మందిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుసేందుకు యత్నిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మంటలు ఆరిపోయాయి. మంటలు అదుపులోకి వచ్చినా పొగ దట్టంగా అలుముకుంది. పొగ కమ్ముకోవడంతో చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో శ్రీశైలం కుడిగట్టు జెన్ కో సిబ్బంది పాల్గొన్నారు. ఘటనాస్థలికి మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంఎల్ఎ గువ్వల బాలరాజు, కలెక్టర్ పరిశీలించారు. 9మంది ఉద్యోగులను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ట్రాన్స్ కో, జెన్ కో సిఎండి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News