Home అంతర్జాతీయ వార్తలు అగ్ని ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృతి…

అగ్ని ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృతి…

Fire-Accidentవాషింగ్టన్: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఎరీ నగరంలోని డే కేర్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు చిన్నారుల మృత్యువాత పడగా… యజమాని తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తక్షణమే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఏడుగురు పిల్లల్ని కాపాడారు. ఎరీ నగరంలోని హ్యారిస్ ఫ్యామిలీ పిల్లల సంరక్షణ కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. మృతి చెందిన పిల్లల్లో 8 నెలల వయసు నుంచి ఏడేళ్ల వయసున్న చిన్నారులు ఉన్నట్టు సమాచారం.

కాగా, మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. రక్షణకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ఘటన జరిగినట్టు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Fire at the Pennsylvania Daycare Center