Friday, April 19, 2024

ఉట్నూర్‌ మద్యం డిపోలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

- Advertisement -
- Advertisement -

Fire breaks out at wine depot in Utnoor

ఆదిలాబాద్‌: జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం జిల్లాలోని ఉట్నూర్‌ క్రాస్‌రోడ్డులోని ఐఎంఎల్‌డీ మద్యం డిపోలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.దీంతో అగ్నిమాపక సిబ్బంది ఫైరింజిన్లతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, డిపో మొత్తం మంటలు వ్యాపించడంతో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. షార్ట్‌ సర్క్యూట్‌ తోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Fire breaks out at wine depot in Utnoor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News