Saturday, June 21, 2025

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ద్వారకా ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. బిల్డింగ్ ఆరో అంతస్తులో మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతుండటంతో నివాసితులు బయటకు పరుగులు పెట్టారు. అయితే, కొందరు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. లోపల చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News