Tuesday, April 23, 2024

టెక్స్‌టైల్ మార్కెట్‌లో అగ్నిప్రమాదం…

- Advertisement -
Fire-accident
గుజరాత్: సూరత్ నగరంలోని రఘువీర్ టెక్స్‌టైల్ మార్కెట్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రఘువీర్ టెక్స్‌టైల్ మార్కెట్‌లోని పదవ అంతస్తులో మంటలు అంటుకున్నాయి. స్థానికుల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన 40 అగ్నిమాపక వాహనాలతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. కాగా, ఇటీవలే ఇదే మార్కెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగే ఉంటుందని షాప్ ఓనర్లు అంచన వేస్తున్నారు. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Fire breaks out in Raghuveer Market in Surat
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News