Home జాతీయ వార్తలు ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

Fire broke out at a shopping centre in Borivali

మహారాష్ట్ర: ముంబైలో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం పశ్చిమ బోరివాలీ వెస్ట్‌లోని ఒక షాపింగ్ సెంటర్‌లో చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భారీగా పొగ కమ్మేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న14 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. అగ్నిమాపక కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై పిఎస్ రహంగ్‌డేల్, చీఫ్ ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ… షాపింగ్ సెంటర్ పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి. మరో 2 గంటల్లో మంటలు అదుపులోకి రావచ్చని ఆయన తెలిపారు.

Fire broke out at a shopping centre in Borivali