Home జనగామ పత్తిమిల్లులో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

పత్తిమిల్లులో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

Fire broke out at Cotton Mill in Jangaon Dist

మన తెలంగాణ/జనగామ: జిల్లా కేంద్రంలో ఇండస్ట్రియల్ కాలనీలోని శివ ఇండస్ట్రీస్ పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్‌ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు సహాయ చర్యలు చేపట్టారు.అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఇండస్ట్రీ యజమాని బస్సు లింగమూర్తి, సిసిఐ అధికారి తిరుమల్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. కరెంటు షార్ట్‌సర్కూట్‌తో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసే క్రమంలో సుమారుగా రెండువేల క్వింటాల పత్తి దగ్ధమైంది. దాదాపు రూ.1 కోటి వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Fire broke out at Cotton Mill in Jangaon Dist