Home జాతీయ వార్తలు దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం

fire broke out in the slums of Tughlakabad in Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లకాబాద్‌లోని మురికివాడలోని వాల్మీకి బస్తీలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. స్థానికులు సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలకు అదుపుచేశారు. డివిజనల్ ఫైర్ ఆఫీసర్ ఎస్.కె. దువా మాట్లాడుతూ.. “మాకు 1:31గంటలకు కాల్ వచ్చింది. 20 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశాము. తెల్లవారుజామున 3:30 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలను ఆర్పడానికి సుమారు 2 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు”అని ఆఫీసర్ పేర్కొన్నారు.

 

fire broke out in the slums of Tughlakabad in Delhi