Home అంతర్జాతీయ వార్తలు కాల్పులతో దద్దరిల్లిన హోండ్యురాస్

కాల్పులతో దద్దరిల్లిన హోండ్యురాస్

GUNFIRE1అమెరికా : సెంట్రల్ అమెరికాలోని హోండ్యురాస్ దేశ రాజధాని తెగుసిగల్పలో కాల్పులు సంచలనం రేపాయి. పోలీసు దుస్తులతో వచ్చిన ఐదుగురు దుండగులు బిలియర్డ్ హాల్ వద్ద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హోండ్యురాస్‌లో డ్రగ్ మాఫియా, ఉగ్రవాదులు తరుచూ దాడులకు పాల్పడుతుంటారు.