Friday, April 19, 2024

సారపాకలో అగ్ని ప్రమాదం: ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

Fire in Sarapaka: One killed

సారపాక లోని ముత్యాలమ్మ గుడి ప్రాంతంలో అగ్ని ప్రమాదం పూర్తిగా దగ్ధమైన ఇల్లు.

స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన బూర్గంపహాడ్ ఎస్సై జితేందర్ మరియు ఫైర్ ఇంజన్ సిబ్బంది.

ఒక మహిళ మృతి మరొకరి పరిస్థితి విషమం.

భద్రాద్రి కొత్తగూడెం: బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీ నందు గల ముత్యాలమ్మ గుడి ఏరియాలోని సుమారు తొమ్మిది మంది నివాసం ఉండే ఒక ఇల్లు ప్రమాదవశాత్తు బాణసంచా పేలి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు ఫైర్ ఇంజన్ కు మరియు పోలీసువారికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎస్సై జితేందర్ తమ స్టాఫ్ తో సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ సిబ్బంది సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

సదరు ఇంట్లో వెనక పోర్షన్ లో అద్దెకు ఉండే లీలా కుమారి అను మహిళ చెప్పిన వివరాల ప్రకారం కుర్మా భీమశంకర్ అతని భార్య భవాని అతని కుమారులు చంద్ర, ప్రశాంత్, వారి పనిమనిషి మరియు అద్దెకు ఉండే వారితో సహా మొత్తం తొమ్మిది మంది నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో భీమశంకర్ భార్య భవాని మరియు కొడుకు చంద్ర ఇంట్లోనే ఉండటం వలన మంటల్లో చిక్కుకొని భవాని పూర్తిగా కాలిపోయాయి. చంద్ర సుమారు 60 శాతం కాలిన గాయాలతో స్తానికుల సహాయంతో హాస్పిటల్ కు తరలించబడ్డారు. (అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం). పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News