Home తాజా వార్తలు కారులో మంటలు : తృటిలో తప్పిన ప్రమాదం

కారులో మంటలు : తృటిలో తప్పిన ప్రమాదం

Fires In Car At Vikarabad On Todayవికారాబాద్ : కొడంగల్ మండలం కస్తూర్‎పల్లి వద్ద రోడ్డుపై వేగంగా వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్ తో పాటు అందులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.