Tuesday, April 16, 2024

తీస్ హజారీ కోర్టులో లాయర్ల ఘర్షణ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లోని తీస్‌హజారీ కోర్టు ప్రాంగణంలో బుధవారం న్యాయవాదుల్లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ గాలిలోకి కాల్పులకు దారి తీసింది. అయితే ఎవరూ గాయపడలేదని పోలీస్‌లు చెప్పారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ( నార్త్ ) సాగర్ సింగ్ కల్సీ వెల్లడించిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం 1.35 గంటల ప్రాంతంలో ఈ ఘర్షణ తలెత్తిందని, న్యాయవాదులతోపాటు ఆఫీస్ బేరర్లు కూడా ఈ ఘర్షణలో పాల్గొన్నారని చెప్పారు. వాదోపవాదాలు తీవ్ర స్థాయికి చేరడంతో గాలిలోకి కాల్పులు జరిపారని తెలిపారు. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదన్నారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది.

గాలిలోకి ఒక వ్యక్తి కాల్పులు జరుపుతుండగా, మరికొంతమంది రాళ్లు, చెక్క పలకలు ఒకరిపై ఒకరు రువ్వుకోవడం కనిపించింది. రెండు వర్గాలు చాలా మంది తెల్ల చొక్కాలతో ఉన్నారు. మరో వీడియోలో ఆ ప్రదేశంలో పేలిన తుపాకీ గుళ్లు కూడా కనిపించాయి. అక్కడ పరిస్థితి సాధారణంగానే ఉందని, దీనిపై చట్టపరమైన చర్య తీసుకుంటామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ రేంజి) పరమాదిత్య కూడా అక్కడికి వెళ్లి పరిశీలించారని పోలీస్‌లు తెలిపారు. సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారని, ఇంతవరకు ఎవర్నీ అరెస్టు చేయలేదని పోలీస్‌లు చెప్పారు. ఈ తుపాకీకి లైసెన్సు ఉందా లేదా అన్నది పరిశీలిస్తామని తెలిపారు. ఢిల్లీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ కేకే మనన్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News