Tuesday, April 23, 2024

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి డిబేట్

- Advertisement -
- Advertisement -

First debate of American presidential candidates

 

ట్రంప్, బైడెన్‌ల మధ్య ముఖాముఖి చర్చ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య చర్చ మంగళవారం రాత్రి జరగనున్నది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ మొదటిసారి ఒకే వేదికపై ముఖాముఖి బహిరంగ చర్చలో పాల్గొననున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం, జాతి వివక్ష దాడులులాంటి పలు అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల ముందు మూడుసార్లు జరిగే ఈ ముఖాముఖి చర్చలను కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్(సిపిడి) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 29న జరిగే తొలి చర్చకు ఫాక్స్ న్యూస్ యాంకర్ క్రిస్ వాల్లేస్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. 90 నిమిషాలపాటు డిబేట్ కొనసాగుతుంది. అక్టోబర్ 15న జరిగే రెండో చర్చను సిస్పాన్ నెట్‌వర్క్, 22న జరిగే మూడో చర్చను ఎన్‌బిసి న్యూస్ నిర్వహించనున్నాయి. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థులు కమలాహారిస్(డెమోక్రటిక్), మైక్‌పెన్స్(రిపబ్లికన్) మధ్య ఒకే ఒక్క డిబేట్ అక్టోబర్ 7న జరగనున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News