Home Default “తీస్ మార్ ఖాన్” సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల

“తీస్ మార్ ఖాన్” సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల

First Look Release From Teesmarkhan Movieహైదరాబాద్ :  ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘తీస్ మార్ ఖాన్’. ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ జి గోగణ రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి  ఈ సినిమా నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో ఆదికి జోడీగా నటిస్తున్నారు. కీలకమైన పాత్రలో ప్రముఖ హాస్య నటుడు సునీల్ నటిస్తున్నారు. దసరా పండగ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ , ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌ ఆకట్టుకునేవిధంగా ఉంది. ఈ సినిమాలో స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది నటిస్తున్నారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా,  మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.