Home రాష్ట్ర వార్తలు రాష్ట్రానికి అగ్రి ఫస్ట్ ర్యాంక్…

రాష్ట్రానికి అగ్రి ఫస్ట్ ర్యాంక్…

agriculture

భూపాల్‌పల్లి జిల్లా కుశ్వంత్‌ను వరించిన ప్రథమస్థానం
ఎపికి చెందిన రవిశ్రీతేజకు ఇంజినీరింగ్ మొదటిర్యాంకు
ఇంజినీరింగ్‌లో 82.47%, అగ్రి, ఫార్మసీ విభాగంలో 93.01% ఉత్తీర్ణత

హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 82.47 శా తం ఉత్తీర్ణత నమోదుకాగా, అగ్రికల్చర్, ఫా ర్మసీ స్ట్రీమ్‌లో 93.01 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎంసెట్‌లో ఇంజనీరింగ్ విభాగంలో 1,31,209 మంది విద్యార్థులు హాజరుకా గా, 1,08,213 ఉత్తీర్ణత సాధించగా, అ గ్రికల్చర్ విభాగంలో 68,550 విద్యార్థులు హాజరుకాగా, 63,758 మంది ఉత్తీర్ణత సా ధించారు. ఆదివారం కూకట్‌పల్లిలోని జెఎన్‌టియుహెచ్‌లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌టియుహెచ్ వైస్ ఛాన్స్‌లర్ ఎ.వేణుగోపాల్‌రెడ్డి, ఎం సెట్ కన్వీనర్ ఎన్.యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపలిగూడెంకు చెందిన కురుసేటి రవిశ్రీ తేజ ఇంజనీరింగ్‌లో 150.7791 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించగా, హైదరాబాద్‌కు చెందిన డి.చంద్రశేఖర్ 148.7791 మార్కులతో ద్వితీయ ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన ఆకాశ్‌రెడ్డి 145.5028 మార్కులతో మూడవ ర్యాంకు సాధించారు. అలాగే అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో భూపాలపల్లి జిల్లాకు చెందిన ఎంపటి కుశ్వంత్155.9766 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, ఎపిలోని రాజమండ్రికి చెందిన దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి 153.2324 మార్కులతో ద్వితీయ ర్యాంకు, కాకినాడకు చెందిన మారసాని వెంకటసాయి అరుణ్ తేజ 153.0185 మూడవ ర్యాంకు సాధించారు.

కాగా గత నెల 3,4,6,8,9 తేదీల్లో జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాలకు మొత్తం 2,17,199 మంది రిజిష్టర్ చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్ విభాగానికి 1,42,210 మంది దరఖాస్తు చేసుకోగా, 1,31,209 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 1,08,213(82.47 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే అగ్రికల్చర్ విభాగానికి 74,989 మంది దరఖాస్తు చేసుకోగా, 68,550 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 63,758(93.01 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్ వ్యవహారంతో ఫలితాలు ఆలస్యం

ఇంటర్ మార్కుల గందరగోళంతో ఎంసెట్ ఫలితాలు ఆలస్యమయ్యాయి. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉన్న నేపథ్యంలో ఇంటర్ రీ వెరిఫికేషన్ ఫలితాలు వెలువడేంత వరకు ఎంసెట్ ఫలితాల ప్రక్రియ నిర్వహించలేదు. ఇంటర్ బోర్డు నుంచి శుక్రవారం సాయంత్రం ఎంసెట్ కన్వీనర్‌కు ఇంటర్ రీ వెరిఫికేషన్ ఫలితాల సిడి అందిన వెంటనే ఎంసెట్ ఫలితాల ప్రక్రియ ప్రారంభించి ఆదివారం ఫలితాలు విడుదల చేశారు.

ఇక్కడ వాళ్లకు.. అక్కడ మనకు టాప్ ర్యాంకులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, పార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ పరీక్షల్లో ఎపి ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటగా, తెలంగాణ ఎంసెట్‌లో ఎపి విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఇరు రాష్ట్రాల ఎంసెట్‌లలో టాప్‌టెన్ ర్యాంకుల్లో ఇరు రాష్ట్రాల విద్యార్థులు ఉండటం గమనార్హం. తెలంగాణ ఎంసెట్‌లో ఇంజనీరింగ్‌లో ప్రథమ ర్యాంకు సాధించిన ఎపిలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన కురిసేటి రవి శ్రీ తేజ, ఎపి ఎంసెట్‌లోనూ ప్రథమ ర్యాంకే సాధించారు. ఎంపి ఎంసెట్‌లో ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణకు చెందిన విద్యార్థులు టాప్‌టెన్ ర్యాంకుల్లో ఆరు ర్యాంకు సాధించగా, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో టాప్‌టెన్‌లో మూడు ర్యాంకులు సాధించారు.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన పి.వేదప్రణవ్ ద్వితీయ ర్యాంకు సాధించగా, అదే జిల్లాకు చెందిన డి.చంద్రశేఖర్ నాలుగవ ర్యాంకు, బి.కార్తికేయ ఐదవ ర్యాంకు సాధించారు. అలాగే రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎ.అభిజిత్‌రెడ్డి 8వ ర్యాంకు, ఆర్యన్ లద్దా 9వ ర్యాంకు, కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎ.హేమవెంకట అభినవ్ 10వ ర్యాంకు సాధించారు. అలాగే ఎపి ఎంసెట్ అగ్రిక్చర్, ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన తిప్పరాజు హాసిత నాలుగవ ర్యాంకు సాధించగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన జి.మాధురిరెడ్డి ఐదవ ర్యాంకు, భూపాలపల్లి జిల్లాకు చెందిన ఎంపటి కుశ్వంత్ 10వ ర్యాంకు సాధించారు. తెలంగాణ ఎంసెట్‌లో ఇంజనీరింగ్ విభాగంలో ఎపి విద్యార్థులు టాప్‌టెన్ ర్యాంకుల్లో మూడు ర్యాంకులు, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో టాప్‌టెన్ ర్యాంకుల్లో ఐదు ర్యాంకులు సాధించారు.

న్యూరో సర్జన్ కావాలన్నదే నా ఆశయం : కుశ్వంత్ఎంసెట్‌లో మొదటి ర్యాంకర్

రాష్ట్ర ఉన్నత విద్యాబోర్డు విడుదల చేసిన ఎంసెట్ ఫలితాల్లో భూపాల పల్లికి చెందిన విద్యార్థి కుశ్వంత్ ప్రతిభను కనబర్చారు రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్‌ను సాధించాడు. భూపాలపల్లికి చెందిన కుశ్వంత్ హైదరాబాద్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో బైపీసీలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. అనంతరం గత నెలలో నిర్వహించిన నీట్, ఎంసెట్ పరీక్షలు రాసాడు. నీట్‌లో జాతీయ స్థాయిలో 55వ ర్యాంక్ సాధించగా తాజాగా ఆదివారం విడుదల చేసిన ఎంసెట్ ఫలితాల్లో అగ్రికల్చర్ ఫార్మసి విభాగంలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించాడు. ఇదిలా ఉండగా కుశ్వంత్ తండ్రి తన చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని తల్లి టైలర్ వర్క్ చేసుకుంటూ చదివించిందని కుశ్వంత్ తెలిపాడు. ఎలాగైనా న్యూరో సర్జన్ డాక్టర్‌గా చేయాలనేదే తన ఆశయమని తెలిపారు.

First rank in agriculture for the state