Thursday, April 25, 2024

చైనా-లావోస్ మధ్య తొలి రైలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

First train of China-Laos Railway

బీజింగ్/వియంటియానె: కోట్లాది డాలర్ల వ్యయంతో చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బిఆర్‌ఐ)లో భాగంగా మొట్టమొదటి సీమాంతర రైలును చైనా శుక్రవారం ప్రారంభించింది. చైనాను లావోస్‌తో కలిపే ఈ రైలు రెండు దేశాల మధ్య ప్రజా, వాణిజ్య సంబంధాల పెంపుదలకు దోహదపడుతుందని చైనా ప్రకటించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, లావోస్ అధ్యక్షుడు తొంగియన్ సిసోలిత్ వీడియో లింక్ ద్వారా చైనా-లావోస్ రైల్వేను శుక్రవారం వీక్షించారు. మొదటి రైలు చైనాలోని యున్నన్ ప్రావిన్సుకు చెందిన కన్మింగ్ నుంచి లావోస్‌లోని వియంటియానెకు బయల్దేరి వెళ్లినట్లు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. చైనాతోపాటు వియత్నాం, థాయ్‌ల్యాండ్, మయన్మార్, కాంబోడియా దేశాల సరిహద్దులను లావోస్ పంచుకుంటోంది. ఆగ్నేయాసియాలోని ఈ దేశాలకు కూడా రైలు ప్రాజెక్టును విస్తరించాలని చైనా భావిస్తోంది. చైనాలాగే లావోస్ కూడా కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉంది. లావోస్ పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆ దేశాన్ని పాలిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News