Thursday, April 25, 2024

68 ఏళ్ల తర్వాత అమెరికాలో ఓ మహిళకు మరణశిక్ష

- Advertisement -
- Advertisement -

టెర్రేహాటే: 68 ఏళ్ల తర్వాత అమెరికాలో ఓ మహిళకు మరణశిక్ష విధించారు. లీసా మాంట్‌గోమెరీ(52) అనే మహిళకు ఇండియానా రాష్ట్రం టెర్రేహాటేలోని జైలు ప్రాంగణంలో బుధవారం తెల్లవారుజామున మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్షను అమలు చేశారు. 1953 తర్వాత ఓ మహిళకు అమెరికాలో మరణశిక్ష విధించిన సంఘటన ఇదే. గతేడాది జులైలో మరణశిక్షలను అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ధరించారు. ట్రంప్ నిర్ణయం తర్వాత ఇప్పటి వరకు 11మందికి మరణశిక్ష అమలైంది. గత 17 ఏళ్లలో అమెరికాలో ఏ ఒక్కరికీ మరణశిక్ష విధించకపోవడం గమనార్హం. లీసా 2004లో బాబీజో స్టిన్నెట్(23) అనే మహిళను తాడుతో ఉరివేసి చంపింది. ఆ సమయంలో స్టిన్నెట్ 8 నెలల గర్భవతి. కాగా, వంటగదిలోని కత్తితో ఆమె కడుపును చీల్చి గర్భంలోని శిశువును లీసా బయటకు తీసింది. ఈ నేరానికి లీసాకు మరణశిక్షను అమెరికా కోర్టు ఖరారు చేసింది.

First woman to federal Execution in US after 68 years

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News