Home సిద్దిపేట వంద శాతం రాయితీ

వంద శాతం రాయితీ

 Fish distribution of fish on 100 percent discount

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: చెరువులు, కుంటలు నిండిన వెంటనే 100 శాతం రాయితీపై చేప పిల్లలను పంపిణీ చే యడం జరుగుతుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపా రు. బుధవారం రాత్రి సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శాస న మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డితో కలిసి మ త్సశాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ జిల్లాలో మత్స సంపద పెరిగే వి ధంగా అధికారులు అన్ని విధాల చర్యలు తీసుకొవాలన్నారు. మత్స కారులకు గత ప్రభుత్వాల హాయంలో జిల్లాకు 3, 4 వాహనాలు ఇచ్చేవారని సిఎం కెసిఆర్ జిల్లాకు 3 వేల వాహనాల సంఖ్యను పెంచారన్నారు. సమీకృత మత్స అభివృద్ధి పథకం ద్వారా 75 నుంచి 90 శాతం రాయితీపై ద్విచక్ర వాహనాలు, ప్లాస్టిక్ చేపల కిట్లు, వలలు, తెప్పలతో పాటు లగేజీ ఆటోలను పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించడానికి ఏర్పాట్లను చేపట్టాలని మంత్రి ఆదేశించారు.