Home తాజా వార్తలు ఆ గ్రామ ప్రజలకు చేపలు ఫ్రీ….

ఆ గ్రామ ప్రజలకు చేపలు ఫ్రీ….

Fishసూర్యాపేట : జిల్లా పరిధిలోని మునగాల మండల కేంద్రంలోని ప్రతి ఇంటిలో సోమవారం రాత్రి చేపల కూర ఘుమఘుమలాడింది. మునగాల చెరువులో గుత్తేదారు శ్రీనివాస్‌ చేపలు పట్టారు. ఆయన ఆ చేపలను విక్రయించకుండా గ్రామంలో ఉన్న రేషన్ కార్డుదారులకు రెండు కిలోల చొప్పున పంచి పెట్టారు. అయితే రేషన్ కార్డుదారులకు ముందుగా కూపన్లు ఇచ్చారు. కూపన్ ను చూపించిన వారికి రెండు కిలోల చెప్పున చేపలను ఉచితంగా పంచి పెట్టారు. సుమారు నాలుగున్నర టన్నుల చేపలను ఉచితంగా పంపిణీ చేశారు. ఇలా ఉచితంగా చేపలను పంచిన తరువాత మిగిలిన వాటిని మంగళవారం మార్కెట్ లో విక్రయించారు.

Fish Free Distribution In Munagala At Suryapet