Home తాజా వార్తలు ఏసీబీ వలలో మత్సశాఖ అధికారి

ఏసీబీ వలలో మత్సశాఖ అధికారి

Bank Manager Arrest

నాగర్‌కర్నూల్: జిల్లా మత్సశాఖ అధికారి నాగులయ్య సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దోరికిపోయాడు. మత్సశాఖ భవన నిర్మాణానికి సంబంధించిన బిల్లు మంజూరు కోసం అధికారి నాగులయ్య ఓ వ్యక్తి నుండి రూ.8 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి మత్సశాఖ భవనం మంజూరైంది. భవన నిర్మాణ పనులు శ్లాబ్ వరకు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన బిల్లు రూ.1,99,215 వరకు రావాల్సివుంది. బిల్లు మంజూరు కోసం మత్సశాఖ మండల అధ్యక్షుడు తెప లక్ష్మయ్య జిల్లా మత్సశాఖ అధికారి నాగులయ్యను కలిశాడు. అయితే బిల్లు మంజూరు చేయాలంటే తనకు రూ.10 వేలు ఇవ్వాలని నాగులయ్య డిమాండ్ చేశాడు. రూ.10 వేలు తీసుకుని తన కార్యాలయానికి రావాలని లక్ష్మయ్యకు చెప్పాడు. దీంతో లక్ష్మయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లక్ష్మయ్యతో అక్కడి వెళ్లిన ఏసీబీ అధికారులు అధికారి నాగులయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Fisheries Officer in ACB trap