Home తాజా వార్తలు వలలో పడి మత్స్యకారుడు మృతి

వలలో పడి మత్స్యకారుడు మృతి

Fishermen dead in nagar kurnool

మన తెలంగాణ/పెద్దకొత్తపల్లి: నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలోని వడ్లవాని కుంటలో చేపల వేటకు వెళ్ళి మత్య్సకారుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం…. మండలానికి చెందిన గౌరమ్మ లింగస్వామి (40) చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని మృతి చెందాడు. దీంతో మృతుని భార్య ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్సై సిద్ధిక్ తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.