Home జాతీయ వార్తలు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

Road Accidentఉత్తరాఖండ్‌ : తెహ్రీ గర్హావాల్‌ జిల్లాలో సోమవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. నైన్‌బాగ్‌ సమీపంలో వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి వంతెనను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ఘటనాస్థలిలోనే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Five Dead In Road Accident At Uttarakhand