Home తాజా వార్తలు ఈతకెళ్లి ఐదుగురు జలసమాధి

ఈతకెళ్లి ఐదుగురు జలసమాధి

Drown-Swimming

మెదక్: చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఐదుగురు మృత్యువాత పడిన విషాద ఘటన మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం కన్నారంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక పెద్ద చెరువులో ఈతకు వెళ్లిన ఐదుగురు నీటమునిగి చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతులను ఇంతియాజ్ అలీ, మహమద్ హాఫీజ్, ఖాజా అహ్మద్ అలీ, ఇసాక్ అలీ, హుదాగా గుర్తించారు. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. పండగపుట మృతుల నివాసాలలో విషాదం అలుముకుంది. నల్లొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుడితండాలో శనివారం ఈతకు వెళ్లి ఐదుగురు బాలురు మృతి చెందిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటుచేసుకోవడం విషాదకరం.