Home అంతర్జాతీయ వార్తలు ఇరాన్ లో భారీ భూకంపం : ఐదుగురు మృతి

ఇరాన్ లో భారీ భూకంపం : ఐదుగురు మృతి

Earthquakeటెహ్రాన్‌: ఇరాన్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకపంపం కారణంగా ఐదుగురు చనిపోయారు. మరో 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వాయువ్య ఇరాన్ లో ఈ భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.9గా నమోదైందని అధికారులు వెల్లడించారు.  పశ్చిమ అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌కు సమీపంలో 2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని వారు చెప్పారు. 2003లో ఇరాన్‌లోని బామ్‌లో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నాడు 26వేల మంది చనిపోయారు. శుక్రవారం ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.

Five Dead With Effect Of Earthquake In Iran