Sunday, December 3, 2023

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

accident

గంగాధర: కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర కురిక్వాల గ్రామం మధ్య రహదారిపై శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ గ్రానైట్‌ లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్‌ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా…. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే కరీంనగర్‌ సర్కార్ దవాఖానకు తరలించారు. మృతులు జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం పూడూర్ నివాసులుగా గుర్తించారు. టాటా ఏస్ వాహనం కరీంనగర్ నుండి పూడూర్ కు  వెళ్తుండగా ఈ  ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Five Death in Road Accident At Karimnagar District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News