Home తాజా వార్తలు ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

Accident

ఎడపల్లి: నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలం జానకంపేట్ నుండి తానకాలాన్ వెళ్లే మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందగా… మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక నిజామాబాద్ సర్కార్ దవాఖానకు తరలించారు.

ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థిలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.ప్రస్తుతం పోలీసుల పరారీలో ఉన్న నిందితులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Five killed in road accident in Nizamabad district