Home తాజా వార్తలు పోలీస్ టెస్ట్‌లో రన్‌కు స్వస్తి

పోలీస్ టెస్ట్‌లో రన్‌కు స్వస్తి

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌లో ఇకనుంచి పరుగు పందెం ఉండదు. 

నిరుద్యోగ యువత ప్రాణాలు హరిస్తున్న ఐదు కిలోమీటర్ల పరుగు పందాన్ని రద్దు చేయాలని రిక్రూట్ మెంట్ బోర్డు చేసిన సూచనలను ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించింది.

Running_manatelangana copyమన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌లో సమూల మార్పు లు చేసేందుకు సర్కారు నిర్ణయించింది. నిరుద్యోగ యువత ప్రాణాలు హరిస్తున్న ఐదు కిలోమీటర్ల పరుగు పందాన్ని రద్దు చేయాలని రిక్రూట్‌మెంట్ బోర్డు చేసిన సూచనలను ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదిం చింది. దీంతో పాటు బోర్డు చేసిన మరికొన్ని సిఫార్సుల కు కూడా సర్కారు ఆమోదం తెలిపింది. ఐదు కిలో మీటర్ల పరుగు పందెం స్థానే ఇక ముందు పోలీసు ఉద్యో గాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు అర్హత పరీక్షలు నిర్వ హిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి తదుపరి అర్హత పరీక్షలు నిర్వహించి ఎంపికలు చేబడతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు రెండు దశాబ్దాల పాటు పోలీసుశాఖలో భర్తీల కోసం నిర్వహించే 5 కెఎం పరుగు పందానికి తెలంగాణ సర్కారు ఎట్టకేలకు స్వస్తి పలి కింది. కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐ ఉద్యోగాల కోసం దర ఖాస్తు చేసుకునే వారి సంఖ్య లక్షల్లో వుంటుం డడంతో దీనిని ప్రాథమిక దశలోనే తగ్గించేందుకు 5 కెఎం పరుగు పందాన్ని అప్పట్లో ప్రవేశపెట్టారు. 25 నిమిషాల్లో ఈ పరుగు పందాన్ని పూర్తి చేసిన వారికి తదుపరి అర్హత పరీక్షలకు ఎంపిక చేసేవారు. మొదట్లో 5 కెఎం పరుగు పందెంలో 25 శాతం ఉత్తీర్ణత కూడా లేకుండా పోగా కొంతకాలం తరువాత ఇది 50 శాతం వరకు పెరిగింది. గత కొంకాలంగా 5 కెఎంలో ఉత్తీర్ణత శాతం 60 శాతం కూడా దాటిన ఉదంతాలున్నాయి. అప్పటి ఎపి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ తరువాత పారామిలటరీ బలగాలలోని కొన్ని విభాగాలు సైతం అమలు చేస్తున్నా యి. అయితే 5 కెఎం పరుగు పందెంలో పదుల సంఖ్య లో నిరుద్యోగులు సొమ్మసిల్లడం, కొందరు మరణిం చడం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. దీనిపై హక్కుల సంఘాలతో పాటు నిరుద్యోగుల నుంచి విమ ర్శలు వెల్లువెత్తాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా 5 కెఎం పరుగు పందెం నిర్వహించడంపై రాజకీయ పక్షాల నుంచి సైతం విమర్శలు వచ్చాయి. దీంతో పారా మిల టరీ బలగాలలో జరిగే భర్తీలో 5 కెఎం పందాన్ని రద్దు చేశారు. దీనిపై రెండేళ్ల క్రితమే ఉమ్మడి ఎపి సర్కా రు కూడా పునరాలోచన చేసింది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే సమయంలో ఎపి రెండు రాష్ట్రాలుగా విడివడింది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో పోలీసు భర్తీలు ఇంకా మొదలవలేదు. ఎపిలో కూడా ఇదే పరిస్థితి నెల కొంది. పోలీసు భర్తీల్లో 5 కెఎం పరుగు పందెంపై పున రాలోచన చేస్తున్నామని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ గతంలోనే వెల్లడించారు. దీంతో పాటు పోలీసు భర్తీలు ఎలా నిర్వహించాలనే అంశంపై కసరత్తులు చేస్తున్నా మని కూడా తెలిపారు. 

తెలంగాణ డిజిపి అనురాగ్‌శర్మ సూచనల ప్రకారం పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీల పై అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంది. దీనిపై నిపుణుల సూచనలను పరిశీలించింది. ఆ తరువాత కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల కోసం నిర్వహించే 5 కెఎం పరుగు పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. దానిస్థానే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇకముందు మొదట అర్హ త పరీక్ష నిర్వహిస్తారు. కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్ స్థాయిలో, ఎస్‌ఐ పోస్టులకు డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు వుంటాయి. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి శారీరక కొలతలతో పాటు దేహదారుఢ్య పరీక్షలు వుంటాయి. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు తదు పరి వంద మీటర్లు, 800 మీటర్ల పరుగు పందెం, షాట్ ఫుట్, లాంగ్‌జంప్, హై జంప్ అంశాలలో పోటీలు వుంటాయి. ఈ ఐదు పోటీల్లో అభ్యర్థులు నిర్ణీత ప్రమా ణాలతో ఉత్తీర్ణులు కావాల్సి వుంటుంది. దీని తరువాత చివరగా రాత పరీక్ష వుంటుంది. ఈ రాత పరీక్షల తరువాత అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు తయారు చేస్తారు. ఈ లిస్టు ఆధారంగా కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల ఎంపిక వుంటుంది.
నెగెటివ్ మార్కుల విధానానికి చెల్లుచీటీ
ఇదిలావుండగా తెలంగాణ పోలీసు విభాగంలో చోటు చేసుకోనున్న మరో మార్పు నెగెటివ్ మార్కుల విధానం రద్దవడం. గతంలో ఈ విధానం వల్ల చాలామంది నిరు ద్యోగులు అరమార్కు, పావు మార్కుతో ఎంపిక కాలేక పోయారు. అభ్యర్థి తన ప్రశ్నపత్రంలో తప్పుడు జవాబు రాస్తే దానికి ఒక మార్కును కట్ చేస్తారు. దీనివల్ల సరైన సమాధానం రాసినా ప్రయో జనం లేకుండా పోయింది. కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాలకు నెగెటివ్ మార్కుల విధా నం ఏమిటని అసెంబ్లీలో ప్రతిపక్షాలు అప్పట్లో కిరణ్ కుమార్ సర్కారును సైతం నిలదీశాయి. ప్రస్తుతం తెలం గాణలో జరిగే తొలి పోలీసు భర్తీలో నెగెటివ్ మార్కుల విధానానికి స్వస్తి పలకాలని సర్కారు నిర్ణయించింది.
నోటిఫికేషన్‌కు ఏర్పాట్లు
మరోవైపు పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వంలోని అన్ని విభాగాలలో గల ఖాళీలను భర్తీ చేసేందుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పోలీసు శాఖలో కూడా ఖాళీలను ఇప్పటికే గుర్తించారు. పోలీసు ఖాళీలు తొమ్మిది వేల వరకు వుండే అవకాశాలున్నాయి.