Home జాతీయ వార్తలు ఎన్ కౌంటర్ లో నలుగురు మావోలు హతం

ఎన్ కౌంటర్ లో నలుగురు మావోలు హతం

OU Student arrested for meet maoist

 

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్ పూర్ జిల్లాలో శనివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. సిఆర్పీఎఫ్, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అర్చ పోలీస్ స్టేషన్‌కు 20 కిలో మీటర్ల దూరంలో ధుర్బెదా గ్రామంలో ఉదయం ఆరు గంటలకు ఎన్‌కౌంటర్ జరిగింది. అర్చ ప్రాంతంలో మావోయిస్టులు యువతకు ట్రైయినింగ్ ఇస్తున్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మావోలకు, భద్రతా బలగాలకు మధ్య గంటన్నర సేపు కాల్పులు జరిగినట్టు సమాచారం. ఘటనా స్థలం నుంచి పెద్ద మొత్తంలో మందు గుండు సామాగ్రి, తుపాకులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పదుల సంఖ్యలో మావోలు ఘటనా స్థలం నుంచి తప్పించుకోవడంతో భద్రతా బలగాలు స్థానిక పోలీసులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టాయి. 

 

Five Maoists Died in Narayanpur Encounter