సిద్ధపేట: పట్టణంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఖాదర్‌పుర వీధిలో నివసించే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు (Five People) అదృశ్యమయ్యారు (Missing). ఫోన్లు కూడా ఇంట్లోనే వదిలేశారు. శనివారం ఉదయం నుంచి ఎవరు కనిపించకపోవడంతో ఏదైనా ఊరికి వెళ్లి ఉంటారని బంధువులు, స్థానికులు భావించారు. కానీ, రెండు రోజులైనా ఆచూకీ తెలియకపోవడంతో వారు కంగారు పడ్డారు. దీంతో బంధువులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.
తమకు అప్పులు ఉన్నాయని.. డబ్బు ఇచ్చేవారు తిరిగి ఇవ్వకపోవడంతో వడ్డీలు కట్టలేక ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాం అని ఆ లేఖ రాశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదృశ్యమైన వారి వివరాలు వీరబత్తిని బాలకిషన్, తండ్రి జనార్థన్, భార్య వరలక్ష్మి, కుమారుడు శ్రావణ్, కుమార్తెలు కావ్య, శిరీషగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.