Friday, April 26, 2024

పాక్ నుంచి వచ్చిన ఐదుగురికి భారత పౌరసత్వం

- Advertisement -
- Advertisement -

Five refugees from Pakistan get Indian citizenship

 

ఇండోర్: మధ్యప్రదేశ్‌లో పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన ఐదుగురు శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించారు. శుక్రవారం ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్‌మిశ్రా వారికి పౌర ధ్రువీకరణ పత్రాలు అందించారు. పౌరసత్వం పొందినవారిలో 40 ఏళ్ల గీత అనే మహిళ ఉన్నారు. ఆమె పాక్‌లోని జకోబాబాద్‌లో 1981, జనవరి 31న జన్మించారు. భారత్‌లో ఉంటున్న ఆమె 2015లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేశారు. తన సోదరి, సోదరుడు కూడా పౌరసత్వం పొందారని ఆమె తెలిపారు. పౌరసత్వం పొందినవారిలో ఓ వివాహిత మహిళ కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. పాక్‌లోని సింధు రాష్ట్రం నుంచి వచ్చిన వందలాదిమంది శరణార్థులు ఇండోర్‌లో ఉంటున్నారు. వారిలో దాదాపు 2000మంది గత ఐదేళ్లలో భారత పౌరసత్వం పొందారు. మరో 1200 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని అధికారులు తెలిపారు.

Five refugees from Pakistan get Indian citizenship

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News