Friday, April 26, 2024

లాక్‌డౌన్ సడలింపులకు ఐదు దశల ప్లాన్

- Advertisement -
- Advertisement -

ramaphosa

 

దక్షిణాఫ్రికాధ్యక్షుడు రమాఫోసా వెల్లడి

జొహన్నెస్‌బర్గ్ : మార్చి 27 నుంచి దక్షిణాప్రికాలో అమలవుతున్న 35 రోజుల లాక్‌డౌన్‌కు మే 1 నుంచి సడలించడానికి ఐదు దశల ప్లాన్‌ను అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ఐదో స్థాయిలో లాక్‌డౌన్ ఉందని, మే 1 నుంచి నాలుగో స్థాయికి వెళ్తుందని కఠినమైన నిబంధనల మధ్య కొన్ని వ్యాపారాల లావాదేవీలు ప్రారంభమౌతాయని చెప్పారు. సరిహద్దులు మూసివేయడం కొనసాగుతుందని, విదేశాల్లో చిక్కుకున్న దక్షిణాఫ్రికా పౌరులను రప్పించడానికి, లేదా ఇక్కడ ఇరుక్కున్న విదేశీయులను తరలించడానికి అనుమతించడమౌతుందని తెలిపారు. మూడో స్థాయిలో పనిచేసే చోట, సామాజిక సమూహాలపై కఠినమైన ఆంక్షలు ఉంటాయని, రెండో స్థాయిలో భౌతిక దూరం పాటిస్తూ సామాజిక కార్యక్రమాలను అనుమతిస్తామని చెప్పారు. ఒకటో స్థాయిలో జాగ్రత్తలు, ఆరోగ్య సూచనలతో సాధారణ పరిస్థితి పునరుద్ధరిస్తామని చెప్పారు.

Five-step plan for Lockdown
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News