Home జాతీయ వార్తలు జమ్మూకశ్మీర్ లో ఉగ్ర కుట్ర భగ్నం

జమ్మూకశ్మీర్ లో ఉగ్ర కుట్ర భగ్నం

Terroristsజమ్మూకశ్మీర్ : ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను పోలీసులు బుధవారం భగ్నం చేశారు. షోపియాన్ జిల్లా పరిధిలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్మీ, సిఆర్ పిఎఫ్, పోలీసు కాన్వాయ్ లను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఉగ్రవాదులు తలదాచుకున్న ఇంటిపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. ఈ క్రమంలో హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. భద్రతాబలగాలు రాకపోకలు సాగించే రోడ్డుపై ఐఇడి బాంబులను అమర్చేందుకు ఉగ్రవాదులు కుట్ర చేశారని పోలీసు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో ఈ ప్రాంతంలో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు.

Five Terrorists Arrest In Shopian at Jammukashmir