Home కరీంనగర్ మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి జైలు శిక్ష

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి జైలు శిక్ష

Rape

మన తెలంగాణ / కరీంనగర్ లీగల్: మైనర్ బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించిన నిందితుడికి ఐదేళ్ళ కఠిన కారాగారా శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జీ సురేష్ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు రామగుండం పట్టణంలోని శ్రీరాంనగర్ హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌కు ముగ్గురు కుమార్తెలు, రెండవ తరగతి చదువుతున్న చిన్న కుమార్తె 2015 జూలై 17న మధ్యాహ్నం చాక్లెట్లు బిస్కిట్లు కావాలని తల్లితో మారం చేయగా దీంతో సమీపంలోని కిరాణ షాప్‌లో చాక్లెట్లు కొనుక్కోమని మైనర్ బాలికకు డబ్బులు ఇచ్చి పంపగా బయటకు వెళ్ళిన బాలిక ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఇరుగు పొరుగువారి సహాయంతో అంతటా వెతకడం ప్రారంభించారు.

కిరాణ షాపు పక్కనే ఉన్న పానుగంటి రాజు (22) ఇంటినుండి బాలిక అరుపులు వినపడడంతో అతని ఇంట్లోకి వెళ్లగా బాలికపై లైంగిక దాడికి ప్రయత్నిస్తున్న రాజు వెంటనే పారిపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు రామగుండం పోలీసులు కేసునమోదు చేయగా గోదావరిఖని డీఎస్పీ మల్లా రెడ్డి నిందితుడిపై చార్జీషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున సు రేందర్ వాదించారు. సాక్షాదారాలు పరిశీలించిన న్యాయమూర్తి సురేష్ నిందితుడైన రాజుకు ఐదేళ్ళ జైలు శిక్షతో పాటు 400 రూపా యల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.