Friday, March 29, 2024

కరోనా సంక్షోభం నుంచి కోలుకోడానికి ఐదేళ్లు

- Advertisement -
- Advertisement -

Five years to recover from corona crisis

మాడ్రిడ్ : కరోనా సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సాధించాలంటే ఐదేళ్లు పట్టొచ్చని ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్థిక వేత్త కార్మెన్ రీన్‌హెర్ట్ అన్నారు. స్పెయిన్ లో ని మాడ్రిడ్‌లో గురువారం నిర్వహించిన ఒక సమావేశంలో ఆమె ప్రసంగించారు. గత ముఫ్పైయేళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రపంచంలో పేదరికం పెరిగిందని, కరోనా కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు బాగా దిగజారాయని ఆమె వెల్లడించారు. అయితే లాక్‌డౌన్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ కొంతవరకు పుంజుకోవచ్చని, కానీ పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థ తిరిగి పురోగతి సాధించాలంటే ఐదేళ్లు పడుతుందని అన్నారు. ధనిక దేశాల కంటే పేద దేశాలు తీవ్రంగా దెబ్బతింటాయని, అసమానతలు కూడా పెరుగుతాయని ఆమె అన్నారు.

Five years to recover from corona crisis

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News