Saturday, March 25, 2023

అట్రాసిటీ కేసులను పరిష్కరించండి

- Advertisement -

poster2

*జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన
మనతెలంగాణ/పెద్దపల్లి:ఎస్‌సి,ఎస్‌టిఅట్రాసిటీకేసులను ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌శ్రీదేవసేనఅధికారులకు సూచించారు.ఎస్‌సి,ఎస్‌టి కేసుల పనితీరుపై గురువారం కలెక్టర్ సమావేశ మందిరం లో జిల్లా స్థాయి విజిలెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి,నమోదయిన కేసులలో ఎన్ని పరిష్కరించారు, ఎన్ని కేసులలో బాధితులకు నష్టపరిహారం చెల్లించారు తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పెద్దపల్లి జిల్లాలోఇప్పటివరకు 60కేసులు నమోదయ్యాయని బాధితులకు నష్టపరిహారంగా 29లక్షల 2 వే ల రూపాయలను చెల్లించినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఇందులో 12 కేసులు ఫాల్స్ కేసులుగా తేల్చామని,6 కేసులు హైకోర్టు స్టే ఆర్డర్‌లో ఉన్నాయని, 2 కేసులలో ముద్దాయిలు పరారీలో ఉన్నారని మిగతా కేసులను నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరిస్తామని పోలీసులు వివరించారు. జిల్లాలో నమోదయిన కేసులలో నష్టపరిహారాన్ని బాధితులకు అందించేందుకు రెవెన్యూ నుంచి రావలసిన బకాయిలను వెంటనే ఇప్పించాలని ఎస్‌సి,ఎస్‌టి మానిటరింగ్ కమిటీ సభ్యులు కోరగా కలెక్టర్ స్పందిస్తూ సాధ్యమైనంత తొందరగా ఇప్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఎస్‌సి సబ్ ప్లాన్ నిధుల వినియోగం పై జిల్లాలోని అన్ని శాఖలు పూర్తి స్థాయి నివేదిక అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు,పెద్దపల్లి ఎంఎల్‌ఎ దాసరి మనోహర్‌రెడ్డి,మున్సిపల్ చైర్మన్ ఎలువాక రాజయ్య,డిఆర్‌ఒ పద్మయ్య,ఆర్‌డివో అశోక్ కుమార్ పెద్దపల్లి,గోదావరి ఖని ఎసిపిలు హబీబ్ ఖాన్,అపూర్వ రా వు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News