Home బిజినెస్ ఫ్లిప్‌కార్ట్-స్నాప్‌డీల్ విలీనం?

ఫ్లిప్‌కార్ట్-స్నాప్‌డీల్ విలీనం?

  • డీల్‌కు మార్గం సుగమం చేసిన జపాన్ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్
  • 1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్‌మెంట్

snapdeal-flipkart

న్యూఢిల్లీ : దేశంలో మరో అతిపెద్ద విలీనం జరగనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశీయ దిగ్గజ ఆన్‌లైన్ మార్కెట్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయని సమాచారం. అమెజాన్ వంటి దిగ్గజ ఇ-కామర్స్ సంస్థలను ఢీకొనాలంటే విలీనం కావడమే పరిష్కారమని ఈ కంపెనీలు భావిస్తున్నట్టు తెలు స్తోంది. దీనికి తోడు ఈ రెండు ఆన్‌లైన్ సంస్థల విలీనాకి గాను జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ మార్గం సుగమం చేసిందని ఓ మీడియా సంస్థ పేర్కొంది. ప్రైమరీ, సెకంటరీ వాటాలను చేజిక్కించుకోవడం ద్వారా ఈ విలీన సంస్థలో 1.5 బిలియన్ డాలర్లు సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్ చేయనుంద ని.. ఇది 15 శాతం వాటా ఉంటుందని పేర్కొంది. ఈ డీల్ లో భాగంగా 1 బిలియన్ డాలర్ల షేర్ల విక్రయం ఉంటుం ది. ఇప్పటికే ఇరు కంపెనీలతో చర్చలు జరిపిన సాఫ్ట్‌బ్యాం క్… కొత్తగా ఏర్పడే సంస్థలో 15 శాతం ప్రైమరీ, సెకండరీ షేర్లను కొనుగోలు చేయాలని ప్రతిపాదించింది. అయితే స్నాప్‌డీల్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లేదా అమేజాన్ లో విలీనం కావాలని చూస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేసిన అమెరికా సంస్థ టైగర్ గ్లోబల్ మేనేజ్ మెంట్‌తో స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహాల్ సమావేశం కూడా నిర్వ హించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇవి నిరాధారమని స్నాప్ డీల్ కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే ఈ రెండు దేశీయ సంస్థలూ ఇటీవలి కాలంలో నిధుల సమీకరణకు నానా అవస్థలూ పడుతున్నాయి. ఖర్చులను తగ్గించుకు నేందుకు ఉద్యోగులను తొలగించడం, విస్తరణ ప్రణాళికల ను వాయిదా వేసుకోవడం చేస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలో ఏదో ఒకదానిలో విలీనానికి స్నాప్‌డీల్ సుముఖంగా ఉందని ఇటీవల వార్తలు హల్ చల్ చేశాయి. ఇవి నిరాధారమైనవని, కంపెనీ లాభాల వైపు పురోగమి స్తోందని స్నాప్‌డీల్ వర్గాలు ఖండిచాయి.
అవకతవకలు జరగకుండా జాగ్రత్త చర్యలు, ఉద్యోగుల తొలగింపు సహా అనేక చర్యలు చేపట్టడం ద్వారా వచ్చే రెండేళ్లలో లాభదా యక సంస్థగా మారాలని స్నాప్‌డీల్ భావిస్తోంది. స్నాప్‌డీ ల్, ఫ్లిప్‌కార్ట్ మరిన్ని నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నా యి. ఈ నేపథ్యంలో నిధుల కొరతతో సతమతమవుతున్న స్నాప్‌డీల్ ఖర్చులు తగ్గించుకునేందుకు గాను ఉద్యోగుల్లో కోత పెడుతున్నట్టు సంస్థ సహ వ్యవస్థాపకుడు కునాల్ స్వయంగా అంగీకరిం చారు. ప్రస్తుతం స్నాప్‌డీల్‌లో 8 వేల మంది ఉద్యోగులను పనిచేస్తున్నారు. పునరుద్ధరణ ప్ర ణాళికలో భాగంగా గత నెలలో షాపోకు గుడ్‌బై చెప్పింది. నాన్ కోర్ ప్రాజెక్టులు తొలగించడంతో పాటు లాభదాయకమైన వృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది.