Thursday, April 18, 2024

ఎత్తిపోతలు షురూ

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు పంప్‌హౌజ్‌ల నుంచి ఎగిరి దుంకుతున్న గోదారి
రెండు బాహుబలి పంప్‌లతో మిడ్ మానేరుకు వరద నీటి తరలింపు
నిండుకుండను తలపిస్తున్న మేడిగడ్డ 10గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలతో త్రివేణి సంగమం వద్ద జలకళ

మన తెలంగాణ/జయశంకర్ జిల్లా /మహాదేవపూర్/ధర్మారం/ రామడుగు: తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌కి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఎగువన మహారాష్ట్రలోని పలు ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు భారీ ఎత్తున వరద నీరు ప్రాణహిత ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులోకి కలుస్తున్నది. ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మేడిగడ్డ వద్ద నిర్మించిన బ్యారేజికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మేడిగడ్డ బ్యారేజీ డి ఈ సురేష్ మన తెలంగాణకు అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పాటు అక్కడ కురిసిన వర్షాలకు వరద నీరు ప్రాణహిత నది ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. 52,300 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసినట్లు డిఈ తెలిపారు. అలాగే లక్ష్మీ పంపుహౌజ్ ద్వారా 4,200 క్యూసెక్కుల నీటిని మూడు లిఫ్ట్‌ల ద్వారా ఎత్తి వేస్తున్నట్లు తెలిపారు. లక్ష్మీపంప్‌హౌజ్ కన్నెపల్లి నుండి అన్నారం సరస్వతి బ్యారేజికి నిరంతరంగా నీటిని ఎత్తిపోతల కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం 11,679 టిఎంసిల నీటి సామర్థం నిల్ల ఉన్నట్లు డిఈ సురేష్ తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నంది పంపు హౌజ్, గాయత్రి పంపు హౌజ్‌ల ద్వారా నీటిని దిగువకు ఎత్తిపోస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మిపూర్ గాయత్రి పంప్‌హౌజ్ నుంచి రెండు బహుబలి పంపులతో 6 వేల క్యూసెక్కుల జలాలను మధ్యమానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. మధ్య మానేరు ప్రాజెక్టు నిల్వ జలాలు ప్రస్తుతం కనిష్ట స్థాయికి చేరడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు మొదలు పెట్టారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మిపూర్ గాయత్రి పంప్‌హౌజ్ నుంచి మొదటి, మూడో బహుబలి పంపుల ద్వారా దాదాపు 6 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. గాయత్రి పంపు హౌజ్ నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల జలాలను గాయత్రి పంప్‌హౌజ్ నుంచి ఎస్‌ఆర్‌ఎస్పి వరద కాలువ ద్వారా మధ్య మానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. ఈ ఎత్తిపోతలతో మధ్య మానేరు జలాశయం నీటి నిల్వ పెరిగి జలకళను సంతరించుకోనుంది. పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంపు హౌజ్‌లో నీటి ఎత్తిపోతలు షురయ్యాయి. నంది పంపు హౌజ్‌లోని 3, 4 బహుబలి మోటార్లను ఆన్ చేసి ఒక్కొ మోటార్‌కు 3150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. గురువారం నాడు రెండు బహుబలి మోటార్లను ఆన్ చేయడంతో 6300 క్యూసెక్కుల కాళేశ్వరం జలాలు దిగువ ప్రాంతానికి తరలి వెళుతున్నాయి. నంది పంపు హౌజ్ నుండి ఎత్తిపోసిన నీటిని రామడగులోని గాయత్రి పంపు హౌజ్‌కు అక్కడి నుండి మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. వర్ష కాలం ప్రారంభం కావడం, ఎల్లంపల్లి ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉండడంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తుగానే నీటిని తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈఈ నూనె శ్రీధర్, సిబ్బంది నీటి విడుదలను పర్యవేక్షిస్తున్నారు. నంది పంపు హౌజ్ వద్ద 3, 4 పంపుల నుండి నీరు బయటకు వస్తుండడంతో చాలా మంది అక్కడికి చేరుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Flood water flows to Kaleshwaram Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News