Home జోగులాంబ గద్వాల్ జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు

జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు

Flood Water Inflow To Jurala Projectజోగులాంబ గద్వాల : ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాల కారణంగా కృష్ణా బేసి‌న్‌‌లోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలకళ సంతరించుకుంటున్నాయి.  జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టుకు 1.48 లక్షల క్యూసె‌క్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.  దీంతో 20 గేట్లు ఎత్తి 1,60,987 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.126 టీఎసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.