Home తాజా వార్తలు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు  వరద ప్రవాహం

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు  వరద ప్రవాహం

Flood Water Inflow To Nagarjunasagar Projectనల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు  వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువనకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కు 62,026 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 81,054 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్  పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను, ప్రస్తుతం నీటి నిల్వ 311.7462 టీఎంసీలుగా ఉంది. ఈ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది.