Home తాజా వార్తలు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద నీరు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద నీరు

Flood Water Inflow To Sriramsagar Projectనిజామాాబాద్ : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.  ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు 21,580 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోండగా, 3,500క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు  కాగా, ప్రస్తుతం 1090 అడుగుల నీరు ఉంది. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 90.31 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది.