Home తాజా వార్తలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు

Flood Water Inflow To Sriramsagar Projectనిజామాబాద్ : ఎగువన కురిసిన వర్షాలతో  శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు  ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నీటి మట్టం 1090.9 అడుగులుగా ఉండగా, పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు గాను, ప్రస్తుత నీటి నిల్వ 89.763 టీఎంసీలుగా ఉంది. ఈ ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది.